25.2 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఏఎంబీ మాల్‌లో ‘అవెంజర్స్: ది ఎండ్ గేమ్’ సినిమా చూసిన వైఎస్ జగన్…

ఏఎంబీ మాల్‌లో ‘అవెంజర్స్: ది ఎండ్ గేమ్’ సినిమా చూసిన వైఎస్ జగన్…

ABM Mall Latest News, YS Jagan Updates, YS Jagan Latest News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ముగినిపోయిన నేతలు పోలింగ్ ముగియగానే విశ్రాంతి తీసుకుంటున్నారు. పలువురు నేతలు తమ కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలను చుట్టి వస్తున్నారు.

వైసీపీ అధినేత జగన్ ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లిరాగా, ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ తమ కుటుంబంతో హిమాచల్ ప్రదేశ్ టూర్‌కు వెళ్లారు.

హాలీవుడ్ సినిమా చూసిన జగన్…

తాజాగా వైసీపీ అధినేత జగన్ ఓ హాలీవుడ్ సినిమాను చూశారు. నగరంలోని ఏఎంబీ సినిమాస్ లో ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ సినిమాను జగన్ వీక్షించారు.

బూడిద రంగు షర్ట్, తెలుపు రంగు ప్యాంటుతో థియేటర్‌కు వచ్చిన జగన్, సినిమాను వీక్షించి తిరుగు ప్రయాణం అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇకపోతే ప్రస్తుతం జగన్ లండన్ వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లండన్‌లో చదువుకుంటున్న తన కూతురిని కలవడానికి జగన్, తన కుటుంబ సభ్యుల సహా వెళ్లనున్నారు. ఈ నెల 12న ఆయన తిరిగి రానున్నారని సమాచారం.

- Advertisement -