23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ మోడీ ప్రమాణస్వీకారానికి ఒకే విమానంలో వెళ్లనున్న జగన్,కేసీఆర్…

మోడీ ప్రమాణస్వీకారానికి ఒకే విమానంలో వెళ్లనున్న జగన్,కేసీఆర్…

YS Jagan Latest News, KCR Latest News, Narendra Modi News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటితో గెలిచిన నరేంద్ర మోడీ…ఈ నెల 30న రెండో సారి ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీకి కాబోయే జగన్ లు ఒకే విమానంలో వెళ్లనున్నారని తెలుస్తోంది.

ఇక అదే విమానంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా ఉంటారని సమాచారం. అయితే 30వ తేదీ ఉదయం జగన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉండగా, దీనికి కేసీఆర్‌తో సహ పలువురు తెలంగాణ మంత్రులు హాజరు కానున్నారు.

ఈ కార్యక్రమం ముగియగానే, మధ్యాహ్న భోజన అనంతరం రెండు రాష్ట్రాల సీఎంలు ఒకే విమానంలో గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారని తెలిసింది.

ఇక ఇదే కార్యక్రమానికి నరసింహన్ కు కూడా ఆహ్వానం అందడంతో ముగ్గురూ కలిసి ఒకే విమానంలో ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. మరి చూడాలి 30వ తేదీన ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో..

చదవండి: ఏపీ రాజకీయచరిత్రలో జగన్ చిరస్థాయిగా నిలిచిపోతాడు: గాలి జనార్దన్ రెడ్డి
- Advertisement -