26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుపై సానుభూతి చూపించిన నాగబాబు…

చంద్రబాబుపై సానుభూతి చూపించిన నాగబాబు…

- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి…23 సీట్లు తెచ్చుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై  జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు  సానుభూతి చూపించారు. చంద్రబాబు ఓటమిపై నాగబాబు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

చంద్రబాబు మన మాజీ సీఎం అని, ఇప్పుడు ఓడిపోయియినంత మాత్రాన ఆయన్ని దారుణంగా విమర్శించటం తప్పు అని అన్నారు. అయితే మనిషి అధికారంలో ఉండగా విమర్శించటం వేరు అని,  ఓడిపోయాక విమర్శించటం చేతకానితనం అని, ప్రత్యర్థి నిరాయుధుడు అయ్యి నిలబడితే వదిలెయ్యాలని, . అంతే కాని అవకాశం దొరికింది కదా అని ట్రోల్ చెయ్యటం ఒక శాడిజం అని  ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా నాగబాబు… పవన్ కల్యాణ్, జనసేన ఓటమిపై కూడా స్పందించిన విషయం తెలిసిందే. జనసేన ఎన్నికల్లో గెలవకపోయినా..నైతికంగా మాత్రం విజయం సాధించింద్నారు. ఖచ్చితంగా రాజకీయాల్లో కొనసాగుతూనే మంచి మార్పు తీసుకొస్తామన్నారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన జనాలకు ఎలాంటి డబ్బులు పంచకుండా ముందుకు వచ్చారన్నారు. అంతేకాదు జనసేనకు కొన్ని లక్షల ఓట్లు వచ్చాయన్నారు.

గెలుపు కోసం ఎంతో అంకితభావంతో పనిచేసిన జన సైనికులంతా పార్టీ ఓటమితో బాధ పడొద్దని చెప్పుకొచ్చారు. ఈసారి ఓడిపోయినా.. నెక్ట్స్ ఎన్నికల వరకు అధైర్యపడకుండా ముందుకెళ్లాలని సూచించారు.

చదవండి: షాకింగ్: ఆ నియోజకవర్గంలో టీడీపీకి డిపాజిట్ కూడా దక్కలేదు…
- Advertisement -