
హైదరాబాద్: నేడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు 97వ జయంతి . ఈ సందర్భంగా ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ తాతకు నివాళులర్పించారు.
తెల్లవారుజామున 5.30గంటలకు ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఆయన సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. తాతలో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని తారక్ భావోద్వేగానికి గురయ్యారు.
అలాగే అదే సందర్భంలో అక్కడి ఏర్పాటలపై మండిపడ్డాడు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా కళకళలాడాల్సిన ఎన్టీఆర్ ఘాట్, అలంకరణ లేక బోసిపోగా, దీన్ని చూసిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ ఘాట్ పై పుష్పాలంకరణను వెంటనే ఏర్పాటు చేయాలని అక్కడే ఉన్న కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేసిన ఎన్టీఆర్, తన సోదరుడితో కలిసి అక్కడే కూర్చున్నారు. సమాధి అలంకరణ పూర్తయ్యే వరకూ అక్కడే ఉన్నారు.
ఆపై తాతయ్యను అందరూ వదిలేశారని, ఇకపై తాతయ్య జయంతి, వర్థంతి వేడుకలను తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించి వెళ్లిపోయారు. ఆ తరువాత ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి తోపాటుగా సుహాసిని కూడా వచ్చి నివాళ్లు అర్పించింది.








