ఆయన కుమార్తెగా పుట్టడం నా అదృష్టం: పురందేశ్వరి

9:11 am, Tue, 28 May 19
daggubati purandeswari facebook

హైదరాబాద్: ఎన్టీఆర్ వంటి మహోన్నతమైన వ్యక్తికి నేను కూతురిగా జన్మించడం తన అదృష్టమని దగ్గుబాటి పురందేశ్వరి చెప్పుకొచ్చింది. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నందమూరి రామకృష్ణ, సుహాసినిలతో కలిసి నక్లెస్ రోడ్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన పురందేశ్వరి, ఎన్టీఆర్ స్మారకం వద్ద నివాళులు అర్పించారు.

ఈ సందర్భంలో …. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై స్పందించాలని కోరగా, ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయాలు మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో సమూల మార్పు తెచ్చిన వ్యక్తి ఆయనేనని అన్నారు.

తిరుమలలో అన్నదానాన్ని ప్రారంభించింది ఎన్టీఆరేనని నందమూరి రామకృష్ణ వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజల కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. సుహాసిని మాట్లాడుతూ, బడుగుల అభ్యున్నతిని, మహిళా సాధికారత కోసం ఎన్టీఆర్ ఎంతో శ్రమించారని గుర్తు చేశారు.