అనంతపురం: తనకు టిక్కెట్ ఇవ్వడానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రూ.30 కోట్లు అడిరని, అయితే తాను డబ్బు ఇవ్వడానికి అంగీకరించలేదంటూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ వెబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా జేసీ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో దుమారం రేగుతోంది. 2014 ఎన్నికలకు ముందు ఈ సంఘటన జరిగిదంటూ జేసీ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుత రాజ్యసభ సభ్యుడైన విజయసాయి రెడ్డిని, తన ప్రధాన అనుచరుల్లో ఒకరైన ఓ కాంట్రాక్టర్‌ను జగన్ తన వద్దకు పంపించారని, జగన్‌కు రూ.30 కోట్లు ఇస్తే మీకే టిక్కెట్ కేటాయిస్తారని వారు తనతో చెప్పారని జేసీ పేర్కొన్నారు.
‘‘అప్పుడు నేను.. వాళ్ల తాత నాకు తెలుసు.. వాళ్ల నాయినా నాకు తెలుసు.. నేను పుట్టడంతోనే గోల్డెన్ స్పూన్‌తో పుట్టాను.. వాళ్ల తాతకన్నా మా తాతలు చానా చానా భూస్వాములు, పెద్ద రెడ్లు. నా కంటే వీడు పెద్దోడా..? నేను కప్పం కట్టడానికి..?’’ అన్నా. ‘‘ఎందుకంటే ఐ యామ్ నాట్ రెడీ టూ పే ది కప్పం..’’ అని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.