22.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుపై విమర్శలు చేసిన వైఎస్ భారతి: సింహాద్రిపురంలో ప్రచారం

చంద్రబాబుపై విమర్శలు చేసిన వైఎస్ భారతి: సింహాద్రిపురంలో ప్రచారం

- Advertisement -

కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతీ రెడ్డి సింహాద్రిపురంలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రజలతో మమేకమయ్యారు. వైసీపీ అభ్యర్థులను గెలిపించాలంటూ కోరారు.

అందరి అభివృద్ధి కోసం..

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి తొమ్మిదేళ్లుగా ప్రజల మధ్య ఉంటూ.. వారి కష్టాలు తెలుసుకున్నారని అన్నారు. వైఎస్ జగన్‌పై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని ఆమె చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాటుపడతారని హామీ ఇచ్చారు.

తాము నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని వైఎస్ భారతి వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ పథకం మోసమని డ్వాక్రా మహిళలు గమనించారని చెప్పారు.

చంద్రబాబు పరిపాలనను ప్రజలు చూశారని, ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్క హామీనీ నెరవేర్చలేదని వైఎస్ భారతి ఆరోపించారు. కాగా, ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు ఆయన తల్లి విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

చదవండి: అప్పటి జగన్ కాదు: వైసీపీలో చేరిన మరో స్టార్ హీరో.. ఏమన్నారంటే..?

 

- Advertisement -