28.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ఆదేశాలతోనే విగ్రహాలని తొలగించారు: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

చంద్రబాబు ఆదేశాలతోనే విగ్రహాలని తొలగించారు: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

- Advertisement -

అమరావతి: గత సోమవారం విశాఖ బీచ్ రోడ్‌లో ఉన్న దివంగత సినీ ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాలను అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. విగ్రహాల ఏర్పాటుకు పర్మిషన్ లేకపోవడం వలనే వాటిని తొలగించినట్లు అధికారులు వివరించారు. అయితే విగ్రహాలని రాజ్యసభ మాజీ సభ్యుడు ప్రొఫెసర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే విగ్రహాలను కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌లు తొలగించారని లక్ష్మీప్రసాద్‌ ఆరోపించారు. ఏఎన్నార్ కుమారుడు నాగార్జున, దాసరి కుమారుడు అరుణ్, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైసీపీలో చేరడాన్ని సహించలేక చంద్రబాబు ఇలా చేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

చదవండి: వైసీపీ అధికారంలోకి వస్తే ఆయనకి కేబినెట్‌లో బెర్త్‌ ఖాయమా..!?

అయితే గతంలో తాను వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి అయితే తెలుగు భాషకు విలువ పెరుగుతుందని వ్యాఖ్యానించడంతో తన పైనా చంద్రబాబుకి కోపముందని చెప్పారు. ఆ కారణంగానే తాను ఏర్పాటు చేసిన విగ్రహాలను తొలగించారని ఆరోపించారు.

అసలు విగ్రహాల అనుమతి విషయంలో కోర్టులో కేసు నడుస్తున్న తరుణంలో చంద్రబాబు వాటిని తొలగించడానికి ఎందుకు ఆదేశించారో చెప్పాలని నిలదీశారు.

చదవండి: ఫలితాల విడుదలకు ముందు జగన్ మౌనం! కారణమేమిటో?
- Advertisement -