18.7 C
Hyderabad
Saturday, November 28, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా ప్రైవేటు సంస్థలకు ఎలా?: ఏపీ సర్కారుపై ఉండవల్లి ఫైర్…

ప్రజల డేటా ప్రైవేటు సంస్థలకు ఎలా?: ఏపీ సర్కారుపై ఉండవల్లి ఫైర్…

Undavalli-Arun-Kumar-over-AP-government-deta-theft, newsxpress.online
- Advertisement -

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరీ వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం వద్ద భద్రంగా ఉండాల్సిన డేటా ఓ ప్రైవేటు సంస్థ వద్దకు ఎలా చేరిందని ఆయన నిలదీశారు.

అంతేగాక, డేటా చోరీ వ్యవహారంపై వైసీపీ ఆరోపణలు చేసినప్పుడు టీడీపీ స్పందించిన తీరు అభ్యంతరకరంగా ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వ స్థాయిని దిగజార్చేలా ఉందంటూ విమర్శించారు.

ప్రభుత్వం అధికారికంగా బదిలీ చేసినా తప్పే…

ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా సరే అధికారికంగా డేటా బదిలీ చేసినా అది తప్పే అవుతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజలకు సంబంధించిన కీలక సమాచారం ఐటీ గ్రిడ్స్ వంటి సంస్థల చేతికి ఇవ్వడం టీడీపీ ప్రభుత్వ తప్పిదమేనని ఆయన అన్నారు.

డేటా చోరీ వ్యవహారంలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ పోలీసుల ముందుకు రాకుండా పరారీలో ఉండటం ఎందుకో అర్థం కావడం లేదని ఉండవల్లి ప్రశ్నించారు. కాగా, డేటా చోరీ వ్యవహారంలో తెలంగాణలో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రత్యేక దర్యాప్తు బృందం డేటా చోరీ కేసును విచారిస్తోంది.

- Advertisement -