28.5 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నటుడు అలీ సంచలన నిర్ణయం.. త్వరలోనే వైసీపీ తీర్థం…

ప్రముఖ నటుడు అలీ సంచలన నిర్ణయం.. త్వరలోనే వైసీపీ తీర్థం…

- Advertisement -

విజయవాడ: టాలీవుడ్ ప్రముఖ నటుడు అలీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే తాను వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు.  అంతేకాదు, పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమని కూడా అలీ పేర్కొన్నారు.

వైసీపీ చీఫ్ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిన తర్వాత గత నెల 28న అలీ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరాలన్న తన కోరికను ఆయన బయటపెట్టినట్టు.. జగన్ కూడా అందుకు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

మరోవైపు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రస్తుతం శ్రీకాకుళంలో కొనసాగుతోంది. ఈ నెల 9న ఇచ్చాపురంలో నిర్వహించనున్న పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో నటుడు అలీ కూడా పాల్గొననున్నాడు. రెండు దశాబ్దాల క్రితం టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన అలీ… 1998లో టీడీపీ తరపున ప్రముఖ నిర్మాత రామానాయుడు కోసం ప్రచారం కూడా చేశారు.

అయితే, ఆ తర్వాత అలీ రాజకీయాలకు దూరమయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు వైసీపీ ద్వారా తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి అలీ ప్రవేశించబోతున్నాడు.

- Advertisement -