33.6 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ మనపై వైసీపీ అవినీతి ముద్ర వేయాలని చూస్తోంది: టీడీపీ నేత

మనపై వైసీపీ అవినీతి ముద్ర వేయాలని చూస్తోంది: టీడీపీ నేత

YCP Latest Updates News, TDP Leader News, AP Political News , Newsxpressonline
- Advertisement -

విజయవాడ: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ హాల్లో చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ అభ్యర్థుల వర్క్‌షాప్‌ జరిగింది.

ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ…ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలకు మనం కొంత సమయం తీసుకోవాలని అనుకోవడం మంచిదేనని, కాని టీడీపీ ప్రభుత్వంపై అవినీతి ముద్ర వేయాలని జగన్‌ ప్రభుత్వం పనిగట్టుకుని ప్రయత్నం చేస్తోందని అన్నారు. దానిని తిప్పికొట్టకపోతే నష్టపోతామని సూచించారు.

అలాగే ఎన్నికల సమయంలో అనేక రోజులపాటు నిర్వహించిన టెలి కాన్ఫరెన్సులు నిరుపయోగంగా మారాయని అశోక్ అభిప్రాయపడ్డారు. నిర్దిష్టంగా ఎవరితో ఏ విషయం మాట్లాడాలో అది మాట్లాడకుండా వేల మందితో టెలి కాన్ఫరెన్సులు పెట్టడంతో వాటిని ఎవరూ సీరియ్‌సగా తీసుకోలేదని చెప్పారు.

టీడీపీ నేతలపై పిటీషన్లు, ఫిర్యాదులు చేస్తేనే నీరు చెట్టు, ఉపాధి పథకం తదితర బిల్లులు పాస్‌ చేస్తామని కింది స్థాయు టీడీపీ నేతలను వైసీపీ నేతలు బ్లాక్‌ మెయిల్‌ చేసి ఫిర్యాదులు ఇప్పిస్తున్నారని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆరోపించారు. ఈ తరహా ఫిర్యాదులను బలంగా తిప్పికొట్టాలని కోరారు.

చదవండి: క్రాస్ ఓటింగ్ వల్లే ఓడిపోయాను: బాలకృష్ణ చిన్నల్లుడు భరత్
- Advertisement -