22.4 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఆ వైసీపీ నేత గెలుపుపై కోర్టుకెక్కిన టీడీపీ నేత…

ఆ వైసీపీ నేత గెలుపుపై కోర్టుకెక్కిన టీడీపీ నేత…

YCP Latest Updates News, TDP Leader News, AP Political News, Newsxpressonline
- Advertisement -

విజయవాడ: ఇటీవల వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్ధి బోండా ఉమా మహేశ్వరావు.. వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణుపై కేవలం 25 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే,

అయితే అత్యల్ప మెజారిటీతో ఓడిపోవడం,  వీవీప్యాట్స్ లెక్కింపు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బొండా ఉమా కోర్టును ఆశ్రయించారు.
తనపై 25 ఓట్లతో వైకాపా అభ్యర్థి మల్లాది విష్ణు గెలుపొందినట్లు అధికారులు మే 23న జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన తన రిట్ పిటిషన్‌లో కోరారు.

అయితే తమ నియోజకవర్గంలోని 11 పోలింగ్‌ కేంద్రాల్లో వీవీప్యాట్స్‌ను లెక్కించాకే ఫలితాల్ని ప్రకటించాలని కోరినా రిటర్నింగ్‌ అధికారి పట్టించుకోలేదని బొండా ఉమ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

కౌటింగ్ రోజునే ఈ వ్యవహారమై అదే రోజు జిల్లా ఎన్నికల అధికారి వినతి సమర్పిస్తూ ఫలితాల ప్రకటనకు ముందే వీవీప్యాట్స్‌ లెక్కింపునకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోలేదన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు… కేసు తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

చదవండి: ఆ విషయంలో సీఎంని మెచ్చుకున్న టీడీపీ నేత…

- Advertisement -