
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్…తమ పార్టీ మేనిఫెస్టో నవరత్నాలులో భాగంగా మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని మాట ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మద్యపాన నిషేదం తొలిదశలో భాగంగా దాదాపు 10 శాతం వైన్ షాపులు క్లోజ్ కాబోతున్నాయి. ఈనెల 30తో 2017-19కి మద్యం షాపులు, బార్‌ల లైసెన్సు ముగుస్తుంది. జూలై నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ వస్తుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 4,200 లిక్కర్ షాపులు, 800కు పైగా బార్‌లూ ఉన్నాయి. వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.17,500 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ ఆదాయంతోనే గత ప్రభుత్వం చాలా పథకాలకు నిధులు సమకూర్చుకుంది.
దీంతో ఆదాయం తగ్గకుండా ఉండేందుకు అధికారులు ప్రభుత్వం ముందు కొన్ని సూచనలు ఉంచబోతున్నారు. దీనిలో వైన్ షాపులు తగ్గాలి… ఆదాయం మాత్రం తగ్గకూడదని చెబుతోన్నారు.
ఏడినులో ప్రధానంగా లైసెన్స్ ఫీజును రెట్టింపు చేయాలని కోరబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇలాగే చేసి, సక్సెస్ అయ్యింది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో మద్యం పాలసీ అమలుపై ప్రభుత్వం అధ్యయనం చేయిస్తోంది. గడువు లోపల అనుకున్న విధంగా పాలసీ ఉండకపోతే, పాత లైసెన్సులను మరికొంతకాలం పొడిగించే అవకాశాలున్నాయి.








