
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ అసెంబ్లీ స్థానాలు కలిగిన జిల్లా విజయనగరం. ఇక్కడ 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఏకంగా ఆరు స్థానాలు గెలుచుకోగా, వైసీపీ మూడు స్థానాలకి పరిమితమైంది.
ఈ నేపథ్యంలో తాజాగా ముగిసిన ఎన్నికలకీ సంబంధించి విజయనగరంలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో ఓ సర్వే ప్రకటించింది. ఆ సర్వే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సర్వే వెల్లడించిన లెక్కల ప్రకారం
చదవండి: దేవుడా… ఇలాంటి సర్వే ఎవరూ ఊహించరు! ఏపీలో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయంటే…
సాలూరు, కురుపాం, బొబ్బిలి, విజయనగరం, పార్వతి పురం నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుందని అంచనా వేసింది. అలాగే చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్లలో వైసీపీ గెలుస్తుందని చెప్పింది. ఇక శృంగవరపుకోటలో టీడీపీ-వైసీపీల మధ్య గట్టి పోటీ ఉందని తెలిపింది. ఇక జనసేనకి ఒక్క సీటు కూడా రాదని తేల్చింది.
ఈ ఫలితాలని చూస్తుంటే టీడీపీ ఐదు స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తుంది. అలాగే వైసీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితమవుతుంది. అయితే కొన్ని సర్వేలలో వైసీపీ మెజారిటీ స్థానాలని గెలుస్తుందని చెబుతున్నాయి. మరి చూడాలి వీటిల్లో ఏ సర్వే నిజమవుద్దో. ఏదైనా మే 23 వరకు చూడాల్సిందే.
చదవండి: మే 23 తర్వాత నీ సంగతి చెప్తా: సింహాచలం ఆలయ ఈవోకి అవంతి వార్నింగ్..








