టీడీపీ నేత సొంత సర్వే: దిమ్మతిరిగే ఫలితాలు! ఏ పార్టీకి ఎన్ని సీట్లో చూడండి…

TDP Leader Latest Survey News, AP Election News, AP Political, Newsxpressonline
- Advertisement -

అమరావతి: మే 23న రాబోతున్న ఏపీ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే రాజకీయ నేతలైతే ఈ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠంగా ఉన్నారు.

ఇప్పటికే ప్రధాన పార్టీల అధినేతలు సహా, చోటా మోటా నేతలంతా తమ స్థాయి కొద్దీ రకరకాల సర్వేలు చేయించుకున్నారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు చేయిస్తున్న సర్వేలను కూడా కొనుక్కొని వాటిని కూడా విశ్లేషించుకుంటున్నారు.

తమ సర్వేలకూ, ఇతరులు చేసిన సర్వేలకూ ఏయే సీట్లలో ఒకే రకమైన ఫలితం ఉంటుందో, అక్కడ కచ్చితంగా అదే ఫలితం వస్తుందని అంచనా వేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే నందిగామకు చెందిన ఓ టీడీపీ నేత సొంతంగా సర్వే చేయించుకున్నారు. ఈ సర్వే ప్రత్యేకత ఏమిటి అంటే.. ఆయన 2014లో కూడా సొంత సర్వే చేయించుకున్నారు. అప్పట్లో టీడీపీ గెలుస్తుందని రిపోర్ట్ వచ్చింది. అలాగే టీడీపీ గెలిచింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు కూడా సర్వే చేయించారు.

చదవండి:  ఆ జిల్లాలో టీడీపీదే మెజారిటీ అంటా…!

తాజాగా చేయించిన సర్వేలో మాత్రం టీడీపీ మాగ్జిమం 58 సీట్లు సాధిస్తుందని తేలింది. అదే సర్వేలో వైసీపీకి మాగ్జిమం 105 స్థానాలు వస్తాయని తేలడంతో, కచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో టెన్షన్ పడుతున్నారని సమాచారం.

ఇన్నాళ్లూ, తమకు సీట్లు తగ్గినా జనసేన ద్వారా పొత్తు పెట్టుకొని అధికారంలోకి రావచ్చనే అంచనాల్లో ఉన్న ఆ నేత తన సర్వే రిపోర్టులో జనసేనకు 3 సీట్లు మాత్రమే వస్తాయని తేలడంతో మరింత ఎక్కువ ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.

సర్వేను నమ్మాలా వద్దా అనే సందేహంలో ఉన్నారట ప్రస్తుతం ఆ నేత. ఐతే కొన్ని ప్రైవేట్ సంస్థలు చేయించిన సర్వేల్లో కూడా ఇలాంటి ఫలితాలే రావడంతో తన సర్వే నిజం అవుతుందేమోనని టెన్షన్ పడుతున్నట్లు తెలిసింది. ఐతే ఈ సర్వేపై టీడీపీ వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందనీ, లేనిపోని గందరగోళం సృష్టించేందుకే ఈ సర్వేను తెరపైకి తెచ్చారా అని సదరు నేతపై మండిపడుతున్నట్లు తెలిసింది.

చదవండి:  చంద్రబాబు, జగన్ మెజార్టీలపై భారీగా బెట్టింగ్! గత రికార్డ్స్ కొల్లగోడతారా?
- Advertisement -