అమరావతి: పార్టీలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. గతంలో పార్టీలో అన్నీ తానై చక్రం తిప్పారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో జగన్ మరో సారి ఆయనకు ఒంగోలు ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ అలక బూనారు.
పార్టీని వీడుతున్నారనె వార్తలు కూడా సోషల్ మీడియాలో షికార్లు చేశాయి. ఆయన ఎవరో కాదు , వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి . ఒంగోలు టికెట్ దక్కకపోవడం, తన రాజకీయ శత్రువు, బావమరిది బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అలకపాన్పు ఎక్కిన వైవి అలకవీడారు.
దీంతో రంగంలోకి దిగిన జగన్ పార్టీ అధికారంలోకి వస్తే వైవీ సుబ్బారెడ్డికి కీలక నామినేటెడ్ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి చెవిలో వేశారట వైసీపీ నేతలు. దీంతో దిగొచ్చిన బాబాయ్ బుధవారం నుంచి పార్టీ కార్యక్రమాల్లో బాగా యాక్టివ్ అయ్యారట.








