25.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఇక చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్ లేదు: టీడీపీ నేత

ఇక చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్ లేదు: టీడీపీ నేత

Chandrababu Naidu News, TDP EX Leader News, AP Politic News, Newsxpressonline
- Advertisement -

తిరుపతి: ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై  తెలుగుదేశం పార్టీ మాజీ నేత మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చి స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. చంద్రబాబు పరాజయంతో తనకెంతో ఆనందం కలిగించిందని, అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవాలని కాలినడకన తిరుమలకు వస్తూ, మెట్టుమెట్టుకూ తాను మొక్కుకున్నానని అన్నారు.

ఇక ఇప్పుడు ఆ మొక్కును తీర్చుకునేందుకు వచ్చానని అన్నారు. అయితే నమ్మినవారిని నట్టేట ముంచే చంద్రబాబుని .. తెలంగాణ నుంచి ప్రజలు ఎన్నడో తరిమేశారని, ఇప్పుడు ఏపీలోనూ అదే జరిగిందని ఎద్దేవా చేశారు.

చంద్రబాబుకు ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదని, ఆయన రాజ్యసభ సీట్లను రూ. 100 కోట్లకు అమ్ముకున్నారని, ఒక ఎస్సీకిగానీ, బీసీకిగానీ ఒక్క పదవి కూడా ఇవ్వలేదని అన్నారు. అయితే రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించేలా ఆ భగవంతుడు జగన్ కు శక్తి సామర్థ్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

చదవండి: బాబుకి ప్రజా సమస్యలకంటే…లగ్జరీ హౌస్ ముఖ్యం అనుకుంటా..!
- Advertisement -