34.3 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ బాబుకి ప్రజా సమస్యలకంటే…లగ్జరీ హౌస్ ముఖ్యం అనుకుంటా..!

బాబుకి ప్రజా సమస్యలకంటే…లగ్జరీ హౌస్ ముఖ్యం అనుకుంటా..!

YCP MP Vijayasai Reddy, Chandrababu Naidu Varthalu, AP Political News, Newsxpressonline
- Advertisement -

అమరావతి:  టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో తన నివాసానికి అనుబంధంగా ఉన్న ప్రజావేదికను.. తమకు కేటాయిస్తే అధికారిక కార్యకలాపాల కోసం వినియోగించుకుంటామంటూ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే.

అయితే దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. సీఎం చంద్రబాబు రాసే తొలి లేఖ ప్రజా సమస్యలపై ఉంటుందని భావించానని, అయితే, ఆయన తన విలాసవంతమైన భవనం ఉంటుందా? పోతుందా? అన్న సంశయంలో ఉన్నారని విమర్శించారు.

40 ఏళ్ల అనుభవానికి తను ఉండే విలాసవంతమైన నివాసం ఉంటుందా,  పోతుందా అనే సంశయం తప్ప ఇంకేమీ కనిపించడం లేనట్టుందని, ప్రపంచం మొత్తాన్ని అమరావతికి రప్పిస్తా అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా?” అని విజయసాయి ట్వీట్ చేశారు.

చదవండి: ప్రజావేదిక కోసం టీడీపీ-వైసీపీ పోటీ…ఎవరికి దక్కుతుందో..?
- Advertisement -