26.3 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ జగన్‌పై అటాక్: హత్యాయత్నంపై లోతైన దర్యాప్తు జరపండి: కేంద్ర మంత్రి సురేశ్‌ ప్రభు

జగన్‌పై అటాక్: హత్యాయత్నంపై లోతైన దర్యాప్తు జరపండి: కేంద్ర మంత్రి సురేశ్‌ ప్రభు

suresh prabhu
- Advertisement -

jagan-suresh-prabhu

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌పై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.  ఎవరు బాధ్యులో గుర్తించాలని విమానయాన శాఖ కార్యదర్శికి సూచించడంతో పాటు ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టాలని సీఐఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యాలయంతో సహా అన్ని శాఖలను ఆదేశించారు. విచారణ జరిపి దోషిని శిక్షిస్తామన్నారు. తక్షణమే దర్యాప్తు మొదలు పెట్టాలని ఆదేశించామని,

ప్రస్తుతం విచారణ జరుగుతోందని సురేశ్‌ ప్రభు ట్విటర్‌లో పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సురేశ్‌ ప్రభు అదనంగా పౌర విమానయాన శాఖను చూస్తున్నారు. అశోక్‌గజపతి రాజు ఈ పదవికి రాజీనామా చేయడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిఫారసు మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనకు మార్చిలో విమానయాన శాఖ అదనపు బాధ్యతలు అప్పదాగించారు.

- Advertisement -