25.2 C
Hyderabad
Saturday, September 19, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కాన్వాయ్ ప్రత్యేకతలేంటో చూడండి!

సీఎం జగన్ కాన్వాయ్ ప్రత్యేకతలేంటో చూడండి!

YS Jagan Latest News, AP Latest Political News, YCP News, Newsxpressonline
- Advertisement -
అమరావతి: ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకుంది. దీనితో ఈ నెల 30 న ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు. దీనితో ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక కాన్వాయ్ ని సిద్ధం చేశారు.

గుంటూరు జిల్లా ఉండవల్లిలోని జగన్ నివాసం వద్ద భద్రతను పెంచిన పోలీసులు, ఆ ప్రాంతాన్నంతా మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. స్థానిక ఇళ్లలోనూ సోదాలు జరిపారు. ఇక జగన్ కాన్వాయ్ నిమిత్తం ఓ బులెట్ ప్రూఫ్ వాహనం, మొబైల్ సిగ్నల్ జామర్, అంబులెన్స్, సెక్యూరిటీ సిబ్బంది వాహనాలను ఏర్పాటు చేశారు.

మొత్తం ఆరు వాహనాల కాన్వాయ్ ని ‘ఏపీ 18పీ 3418’ నంబర్ తో అధికారులు ఏపీ సీఎం జగన్ కి కెటాయించారు. ఈ వాహనాలన్నీ ప్రస్తుతం జగన్ ఇంటి ముందే నిలిచివున్నాయి. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ రంగంలోకి దిగి, జగన్ భద్రతను స్వయంగా చేతుల్లోకి తీసుకుంది.
 
ఏపీలో వైసీపీ జోరుకి టీడీపీ నిలబడలేకపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతూ , చివరికి భారీ విజయాన్ని అందుకుంది. జగన్ నేతృత్వం లోని వైసీపీ 151 స్థానాల్లో విజయం సాధించింది.
 
అధికార టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఘోర పరాజయాన్ని చవిచూసింది. టీడీపీ, కేవలం 23 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక జనసేన పార్టీ పూర్తిగా వెనకబడిపోయింది. ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది.
 
- Advertisement -