27.8 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ అప్పుడే పవన్ ఆయష్షు సగం తగ్గింది…పోసాని సంచలన వ్యాఖ్యలు…

అప్పుడే పవన్ ఆయష్షు సగం తగ్గింది…పోసాని సంచలన వ్యాఖ్యలు…

- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై నటుడు పోసాని మురళీకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ… ఎప్పుడైతే పవన్ కల్యాణ్, చంద్రబాబును కలిశారో, ఆనాడే అతని రాజకీయ జీవితం పతనం కావడం ప్రారంభమైందని అన్నారు.

అయితే రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతోందని రాజకీయాల్లోకి వచ్చిన పవన్, అప్పటికే డ్యామేజ్ ఉన్న వ్యక్తిని, సీనియర్ అంటూ సపోర్ట్ చేయడాన్ని ప్రజలు ఏ విధంగా సమర్ధిస్తారు అంటూ మండిపడ్డారు.

అసలు చంద్రబాబును సపోర్ట్ చేయగానే పవన్ ఆయుషు సగం తగ్గిపోయిందని అన్నారు. రాజకీయాల పట్ల అవగాహన ఉన్న పవన్ చేసిన పెద్ద తప్పు ఇదేనని, అవినీతిపరుల పంచెలూడదీసి కొట్టాలని ఒకప్పుడు వ్యాఖ్యానించిన పవన్, అదే అవినీతి మురికిని అంటించుకున్న చంద్రబాబును సపోర్ట్ చేశాడని విమర్శించారు.

ఇక వంటవాళ్లకు, కారు డ్రైవర్లకు అనుభవం, సీనియారిటీ ఉండాలే తప్ప, రాజకీయాలకు కాదని, రాజకీయాలకు కావాల్సింది నిజాయితీయేనని చెప్పుకొచ్చారు. పవన్ మరచిపోయి, చంద్రబాబుకు సీనియారిటీ ఉందని ఆయన పక్కన చేరారని, అదే ఇప్పుడు పవన్ కొంపముంచిందని అన్నారు.

చదవండి టీడీపీ ఓటమికి పరోక్ష కారణం జనసేనేనా?
- Advertisement -