
అమరావతి: ఏపీ ఎన్నికల ఫలితాల్లో చావుదెబ్బ తిన్న జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. జనసేన పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు రావెల లేఖలో పేర్కొన్నారు.
రావెల ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జనసేనకి రాజీనామా చేసిన రావెల…త్వరలోనే వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది.
ఇక రావెల 2014 ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీలో టిక్కెట్ దక్కించుకొని ఆ ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు.
అయితే మూడేళ్ల తరువాత కేబినెట్ విస్తరణలో భాగంగా చంద్రబాబు రావెల కిషోర్ బాబును తప్పించి నక్కా ఆనంద బాబుకు మంత్రి పదవి ఇచ్చారు. దీంతో..అప్పటి నుండి అసంతృప్తిగా ఉన్న రావెల..ఎన్నికల ముందు టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఇక ఈ ఎన్నికల్లో అదే ప్రత్తిపాడు నుంచి జనసేన అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయి…ఇప్పుడు ఆ పార్టీనే వీడుతున్నారు.








