
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్తమంత్రులుగా 25 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. వీరి చేత రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
అయితే జగన్ కేబినెట్‌లో అందరూ ఊహించిన విధంగానే….వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితులైన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు కూడా స్థానం దక్కించుకున్నారు.
అయితే జగన్ ప్రభుత్వంలో కీలక శాఖలు దక్కనున్నాయని తెలుస్తోంది. పెద్దిరెడ్డికి హోం శాఖ దక్కే అవకాశముందని అంతా అనుకుంటున్నారు కానీ… హోం శాఖ ఆయనకు కాకుండా పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు ఇచ్చి.. పెద్దిరెడ్డికి పంచాయతీరాజ్‌శాఖ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని, పెద్దిరెడ్డికి ఈ శాఖ దాదాపు ఖరారు అయిపోయిందని తెలుస్తోంది.
అటు బుగ్గనకు ఆర్ధిక శాఖ ఇస్తారని సమాచారం. కాగా మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి ఇవాళ సాయంత్రం శాఖలు కేటాయింపు జరుగుతుంది.








