22.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సక్రమంగా జరిగుంటే ఫలితాలు మరోలా ఉండేవి…

ఎన్నికలు సక్రమంగా జరిగుంటే ఫలితాలు మరోలా ఉండేవి…

- Advertisement -

అమరావతి: ఇటీవల ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం పాలవ్వడంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండు రోజుల నుంచి అమరావతిలో జిల్లాల వారీగా ఆ పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇక తాజాగా తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలతో డీలా పడకుండా… ప్రజల కోసం మరింత బలంగా ముందుకు సాగుదామని ఆ పార్టీ నేతలకి సూచించారు.

అయితే ఎన్నికలు సక్రమ పద్ధతిలో జరగలేదని చెప్పిన పవన్….ఇతర పార్టీల నేతలు కోట్ల రూపాయలను ఖర్చు చేశారని అన్నారు. సక్రమంగా ఎన్నికలు జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని అన్నారు.

ఇక కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ఖర్చు రూ. 150 కోట్లు దాటిందని… జనసేన ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని తెలిపారు. ఓటర్లకు డబ్బు ఎరవేయకుండా, స్వచ్ఛమైన రాజకీయాలు చేశామని అన్నారు.

నాలుగేళ్ల క్రితమే తాము పోటీ చేసి ఉంటే తమ బలం మరింత పెరిగేదని చెప్పారు. జనసేన కోసం యువతీయువకులు, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని తెలిపారు.

 చదవండి: ఏపీలో పాలన దేశానికే మార్గదర్శకంగా ఉండాలి: సీఎం జగన్
- Advertisement -