
- Advertisement -
- Advertisement -

అలాగే సీపీఎస్ రద్దు విషయంలో రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పాడు . ఈరోజు సచివాలయం ఉద్యోగులతో గ్రీవెన్స్ హాల్ లో సమావేశమైన జగన్ ఈ మేరకు ప్రకటించారు.
తమ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించాలంటే అందరు ఉద్యోగుల సహకారం అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. అందరూ కలిసి ప్రజలకు మెరుగైన పాలన అందిద్దామని పిలుపునిచ్చారు. కాగా, ముఖ్యమంత్రి నిర్ణయంపై ఉద్యోగ సంఘాలతో పాటు చాలామంది ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.