26.2 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఇక జనసేన వంతు.. పార్టీ అభ్యర్థులతో నేడు పవన్ సమీక్ష సమావేశం!?

ఇక జనసేన వంతు.. పార్టీ అభ్యర్థులతో నేడు పవన్ సమీక్ష సమావేశం!?

Pawan Kalyan Latest News, Janasena Updates News, Mangalagiri Latest News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఏపీలో ఎన్నికలు ముగిసి నేటికీ సరిగ్గా నెల రోజులు అవుతోంది. ఇంకా ఫలితాలు రావాలి అంటే మరో 13 రోజుల పాటు వేచి చూడక తప్పదు. కౌంటింగ్ సమయం దగ్గర పడేకొద్దీ పోటీ చేసిన అభ్యర్థులలో కూడా టెన్షన్ పెరిగిపోతుంది.

ఇకపోతే టీడీపీ, వైసీపీ అధినేతలు ఎన్నికల పోలింగ్ ముగిసిన వారం రోజుల నుండే నియోజక వర్గాల వారికీ అభ్యర్థులతో సమీక్షలు నిర్వహించి, గెలుపుపై ఒక అంచనాకి వస్తున్నారు.

ముఖ్యంగా చంద్రబాబు ఈ విషయంలో కొంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కొక్క జిల్లా నేతలతో ఒక్కోసారి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ గెలిచేది మనమే అనే ధీమాని ఆయా నేతల్లో కలిగిస్తున్నారు. అయినా సరే టీడీపీ అభ్యర్థులలో మాత్రం ఏదో ఒక మూలన భయం అనేది ఉంది.

మరోవైపు చాలావరకు సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో వైసీపీయే అధికారంలోకి వస్తుందంటూ ఘంటాపథంగా అవి చెబుతుండడంతో వైసీపీ నేతలు ఆనందంలో మునిగిపోతున్నారు.

 
ఇక అసలు విషయానికొస్తే.. ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ యాక్షన్ లోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.  ఓవైపు వైసీపీ, టీడీపీ అధినేతలు తమ తమ పార్టీల నేతలతో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తుండగా.. పవన్ మాత్రం ఇప్పటి వరకు ఇలాంటివేమీ చేయలేదు.
 
దీంతో జనసేనకు అధికారం ఓ కలగానే మిగలనుందని, ఈ విషయం తెలిసే ఆ పార్టీ అధినేత పోలింగ్ తరువాత గప్‌చుప్ అయి పోయారని, అందుకే ఆయన తన పార్టీ అభ్యర్థులతో కనీసం సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించడం లేదని కొన్ని రోజులుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 
 
ఇలాంటి సమయంలో జనసేనాని తిరిగి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవడం, ఎన్నికల్లో పోటీ చేసిన తమ పార్టీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించడంతో.. ఈ భేటీ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన అభ్యర్థులలో 50 శాతానికి పైగా అభ్యర్థులు ఈ భేటీలో పాల్గొనబోతున్నట్టు సమాచారం.
 
పవన్ ఆదివారం ఈ భేటీని ఏపీ రాజధాని అమరావతిలోని మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయంలో నిర్వహించబోతున్నారని సమాచారం. ఈ భేటీలో ముఖ్యంగా పోలింగ్ సరళి, గెలుపు అవకాశాలు, ఈవీఎంల పనితీరుపై నాయకుల అభిప్రాయాలు ఆయన తెలుసుకోనున్నారు.
 
అలాగే కొన్ని చోట్ల పార్టీ అభ్యర్థులు సరిగా ప్రచారం నిర్వహించలేదనే సమాచారం కూడా ఆయన వద్దకు చేరింది.  అభ్యర్థులతో సమీక్ష సందర్భంగా పవన్ ఈ విషయాన్ని ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది.
 
ప్రతిపక్ష పార్టీలు తమకు వందకుపైగా సీట్లు వస్తాయని ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో జనసేన కచ్చితంగా ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందనే విషయంపైనా పవన్ కల్యాణ్ ఈ సమీక్ష సమావేశం ద్వారా ఓ అంచనాకు రానున్నారు. అలాగే పార్టీ అధికారంలోకి రాకపోతే.. తరువాత తమ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి? ఎలా ముందుకు పోవాలి? అనే విషయాలపైనా చర్చించి ఒక నిర్ణయానికి రాబోతున్నట్లుగా సమాచారం.
 
 
 
- Advertisement -