
మంగళగిరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సీఎం జగన్‌పై పరోక్ష విమర్శలు చేశారు. నిన్న మంగళగిరిలో పార్టీ నేతలు,కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తాను రాజకీయాల్లోకి వచ్చింది పారిపోవడానికి కాదని, నిలబడి రాజకీయాలు చేయడానికి అని స్పష్టం చేశారు.
అయితే కొందరు బీజేపీ పక్షాన చేరొచ్చు కదా అని అడిగారని, వాళ్లకు చెప్పేదొక్కటే. తనకు బీజేపీతో గానీ, ప్రధాని మోడీతో గానీ వ్యక్తిగత వైరం ఏమీలేదని అన్నారు. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, హక్కుల గురించి అడిగానంతే అని చెప్పారు.
ఇక ఇప్పుడుఏ ఏపీని పాలిస్తున్న వ్యక్తులకు మోడీ అంటే భయం ఉంటుందేమో కానీ, పవన్ కల్యాణ్ కు మాత్రం భయంలేదని అన్నారు. తనకు స్వార్థంలేదు కాబట్టి తననెవ్వరు బెదిరించలేరని, తన చివరిశ్వాస వరకు ప్రజలకోసమే ఉంటానని చెప్పారు.
తను ఇక్కడ ఉన్నది సినిమాలు చేయడానికి కాదని, ప్రజల సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని, పనిచేసుకుంటూ వెళ్లడమే తనకు తెలుసని, ఫలితాలు, పదవి నా వెంట పరిగెత్తుకుని రావాలని ఆవేశపూరితంగా మాట్లాడారు.








