ఏపీ రాజకీయ బాధిత రాష్ట్రం: కేంద్రంపై మరోసారి ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు…

chandra-babu-finance-commission
- Advertisement -

15th-finance-commission-meetingఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయ బాధిత రాష్ట్రమని సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  గురువారం 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులతో అమరావతిలో ఆయన సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆర్థిక సంఘం చైర్మన్ నందకిషోర్ సింగ్, ఇతర సభ్యులను సీఎం సాదరంగా ఆహ్వానించారు.  సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, నాలుగేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతి, వృద్ధి గణాంకాలపై 15 ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీ కేంద్రం నిలబెట్టుకోలేదంటూ ఆర్థిక సంఘం ప్రతినిధుల సమక్షంలోనే దుయ్యబట్టారు. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఏ అంశాన్నీ కేంద్రం అమలు చేయలేదని విమర్శించారు. అయినప్పటికీ తమ ప్రభుత్వం ఏపీలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్త్రతంగా అమలు చేస్తోందన్నారు.

హోదాపై మాటమార్చిన కేంద్రం…

దేశ సంపద, వృద్ధికి దోహదపడేలా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. పురోగామి రాష్టాలను దెబ్బతీయడం మంచిది కాదంటూ కేంద్రానికి హితవు పలికారు. కేంద్రం ఇచ్చిన 350 కోట్లను కూడా వెనక్కి తీసుకుందని విమర్శించారు. 14వ ఆర్థిక సంఘంపై నెపాన్ని నెట్టి హోదాపై మాటమార్చిందంటూ సీఎం చంద్రబాబునాయుడు క్రేంద్రంపై ధ్వజమెత్తారు.  అభివృద్ది చెందే రాష్టాలకు చేయూత అందించాలని కోరారు. ఆర్థిక సంఘాల నివేదికలకు 1971 జనాభా లెక్కలు ప్రాతిపదిక కావాలన్నారు.

మధ్యప్రదేశ్‌లో మెట్రోలకు భారీ నిధులు సమకూర్చారని.. కానీ విశాఖ, విజయవాడ మెట్రోలకు మాత్రం కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. గతంలో నయా రాయపూర్‌కు 4500 కోట్ల సాయం అందించారంటూ చంద్రబాబు గుర్తు చేశారు. అమరావతికి కేంద్రం కనీసం రూ.9000 కోట్లు గ్రాంటుగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వెనకబడిన జిల్లాల అభివృద్దికి 22,250 కోట్లు సిఫార్పు చేయాలన్నారు.

- Advertisement -