23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ టీడీపీని వీడేందుకు ఎవరూ సిద్ధంగా లేరు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

టీడీపీని వీడేందుకు ఎవరూ సిద్ధంగా లేరు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

TDP Leader Latest News, Chandrababu Naidu News, AP Political News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారో తనకు తెలుసని ఏపీ సీఎం జగన్ ఈరోజు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు.

ఓ చర్చా కార్యక్రమంలో ఈ విషయమై మాట్లాడారు. కేసీఆర్ సావాసంలో ఉన్న జగన్ కూడా ప్రతిపక్షం లేకుండా చేయాలన్న ఆలోచనలో ఉన్నారేమోనని వ్యాఖ్యానించిన గోరంట్ల, తమ పార్టీని వీడేందుకు ఎవరూ సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.

నాడు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టీడీపీలో ఎందుకు చేరారన్న విషయాన్ని జగన్ ఆలోచించుకోకుండా, ఆ ఎమ్మెల్యేలను తాము కొనుగోలు చేశామని ఆరోపించడం కరెక్టు కాదని హితవు పలికారు.

ఏదేమైనప్పటికి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఓ చట్టం రావాల్సిన అవసరం ఉందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. 

చదవండి: ముందుగా జగన్ ప్రతిపక్షాలపై విమర్శల కార్యక్రమం మొదలు పెట్టారు: టీడీపీ నేత
- Advertisement -