27.2 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ అనుభవం లేని వ్యక్తి సీఎం అయితే ఇలానే ఉంటుంది: జగన్‌పై లోకేశ్ ఫైర్

అనుభవం లేని వ్యక్తి సీఎం అయితే ఇలానే ఉంటుంది: జగన్‌పై లోకేశ్ ఫైర్

- Advertisement -

అమరావతి: అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో జగన్‌మోహన్ రెడ్డి నిరూపిస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.

వైసీపీ ప్రభుత్వంలో అమరావతిని ఎడారిలా మారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయని ఆరోపించారు.

అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వంగా వైసీపీ ప్రభుత్వం మిగిలిపోయిందని విమర్శించారు. పాదయాత్ర సమయంలో 900 హామీలు ఇచ్చి ఇప్పుడు నవరత్నాలను మాత్రమే హామీలుగా చెబుతున్నారని దుయ్యబట్టారు.

కొత్త ఇసుక విధానం అంటూ గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో సిమెంట్ కన్న తక్కువ ధరలో ట్రాక్టర్ ఇసుక వచ్చిందని.. ఇప్పుడు ధరలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు.

ఇసుక మాఫియా అని విష ప్రచారం చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పటివరకు ఒక్క అవినీతిని కూడా ఎందుకు నిరూపించలేకపోయిందని లోకేశ్ సూటిగా ప్రశ్నించారు.

- Advertisement -