26.2 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబు రక్తం మరుగుతుందా?: నాగబాబు సెటైర్లు!

ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబు రక్తం మరుగుతుందా?: నాగబాబు సెటైర్లు!

nagababu sensational comments on cm chandrababu naidu
- Advertisement -

nagababu and chandrababu

మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా మై ఛానల్-నా ఇష్టం అనే ఒక యూట్యూబ్ ఛానల్ ని స్థాపించిన విషయం తెలిసందే. ఈ ఛానల్ ద్వారా తనదైన రీతిలో అందరిపై సెటైర్లు వేస్తూ సంచలనాలు సృష్టిస్తున్నాడు. మొన్న బాలకృష్ణ , నారాలోకేష్ , జగన్ కాగ నేడు ( శుక్రవారం ) ఏపీ సీఎం చంద్రబాబు వంతువచ్చింది.

మన సీఎం రక్తం మరగడానికి ఇంత సమయమా..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఏపీ అసెంబ్లీలో బీజేపీపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తే జైలులో పెడతారా? అని బీజేపీ సభ్యులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తీరు చూస్తుంటే తన రక్తం మరుగుతోందని అసెంబ్లీ లో రెచ్చిపోయాడు.

https://youtu.be/WLLgqysUObw

తాజాగా ఈ వ్యవహారంపై మెగాబ్రదర్ నాగబాబు ఒక ఫన్నీ వీడియోను విడుదల చేశారు. ఇందులో నాగబాబు మాట్లాడుతూ ..” పాలు మరగడానికి నాలుగున్నర నిమిషాలు పడితే మన సీఎం రక్తం మరగడానికి నాలుగున్నరేళ్లు పట్టింది. ఎక్కువ మంట పెడితేనే పాలు మరుగుతాయి. ఎలక్షన్లు వస్తేనే చంద్రబాబు రక్తం మరుగుతుంది ..” అంటూ తనదైన రీతిలో సెటైర్లు వేశారు.

చదవండి: నేను నా అవినీతి..’! స్కిట్ నాది.. టైటిల్ మీది.. మెగాబ్రదర్

- Advertisement -