29.5 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఎనిమిదేళ్ల నాటి ఆందోళనకు ఇప్పుడు వారెంటా? ఇది మోడీ మార్కు కుట్రే: సోమిరెడ్డి ఫైర్

ఎనిమిదేళ్ల నాటి ఆందోళనకు ఇప్పుడు వారెంటా? ఇది మోడీ మార్కు కుట్రే: సోమిరెడ్డి ఫైర్

ap-minister-somireddy
- Advertisement -

somireddy-chandramohan-reddy

నెల్లూరు: ఎనిమిదేళ్ల క్రితం ఆందోళన చేసిన చంద్రబాబుకు ఇప్పుడు వారెంట్‌ ఇస్తూ నోటీసులు జారీ చేయడం ఏంటని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. బాబ్లీ ప్రాజెక్టు కడితే తెలంగాణ ఎడారిగా మారుతుందనే ఉద్దేశంతోనే ఆనాడు చంద్రబాబు పోరాటం చేశారని చెప్పారు. పోలీసులు అరెస్టు చేస్తే ఐదు రోజుల తర్వాత బెయిల్‌పై వచ్చారని గుర్తు చేశారు.

చదవండి: తెలంగాణ కోసమే వ్యతిరేకించా, ఎన్నో ఇబ్బందులు పెట్టారు, ఆరోజే చెప్పా: అరెస్ట్ వారెంట్‌పై చంద్రబాబు

చదవండి: సంచలనం: చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్.. అదీ నాన్ బెయిలబుల్! ఎందుకంటే…

ఇది కచ్చితంగా మహారాష్ట్ర సీఎం, ప్రధాని మోడీ కలిసి చేస్తున్న కుట్ర అని మంత్రి సోమిరెడ్డి ఆరోపించారు. బీజేపీ వ్యతిరేకులను అణగదొక్కడమే మోడీ ప్రధాన అజెండాగా పెట్టుకున్నారంటూ విమర్శించారు. ఇప్పటికైనా మోడీ పద్ధతి మార్చుకోకుంటే దేశవ్యాప్తంగా ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదని ఆయన హెచ్చరించారు.

నెల్లూరులో భారీ నిరసన…

అసలు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వారెంట్‌ జారీ చేయడం దారుణమన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ కేసు వాపసు తీసుకోవాలని మంత్రి సోమిరెడ్డి డిమాండ్ చేశారు.  అంతేకాదు, ఆ రోజున బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతుంటే కేసీఆర్‌ ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబుకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేయడాన్ని నిరసిస్తూ శనివారం సాయంత్రం నెల్లూరులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు ఆయన చెప్పారు.

- Advertisement -