- Advertisement -
తూర్పుగోదావరి: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను పట్టపగలే విశాఖపట్నంలో కాల్చి చంపడం ద్వారా పోలీసులకు గట్టి సవాల్ విసిరి మళ్ళీ ఏఓబీలో పట్టు సాధిస్తున్న సమయంలో మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ తగిలింది.
ఛత్తీస్‌గఢ్, ఆంధ్రా సరిహద్దులలో ఇడుమా బెటలియన్ డిప్యూటీ కమాండర్ పోడియం ముడాను పొలీసులు అరెస్టు చేశారు. సోమవారం ముడాను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు తూర్పు గోదావరి ఎస్పీ విశాల్ గున్నీ,
2014లో ఛత్తీస్‌గఢ్‌లో ఆ రాష్ట్ర మంత్రి మహేందర్ కర్మ సహా 198 మంది పోలీసుల మృతికి కారణమైన ఘటనలో పాల్గొన్న మావోయిస్టు గ్రూప్ కమాండర్ ఇడుమాకు, ముడా ప్రధాన అనుచరుడు. ముడా నుంచి 20 డిటోనేటర్లు, 20 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
- Advertisement -