అమరావతి: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ ఈ నెల 9న విడుదలై…మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైన అన్నీ చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.
అయితే మహర్షి సినిమా గురించి మంగళవారం టీడీపీ సమావేశంలో వెరైటీగా చర్చకి వచ్చింది. ఉండవల్లిలో టీడీపీ అధికార ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సమావేశమయ్యారు.
చదవండి: అది చెప్పడానికి విజయసాయిరెడ్డి ఎవరు? సోమిరెడ్డి ఫైర్
ఈ సందర్భంగా ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఈ సినిమా ప్రస్తావనను తీసుకొచ్చారు. అందులో ఒక సీన్ గురించి చెబుతూ…..సినిమాలోని విలన్ పాత్రధారి అయిన జగపతిబాబు చివర్లో ఆ ఒక్క ఊరి జోలికి వెళ్లకుంటే బాగుండేదని అనుకుంటాడని, ఇప్పుడు మోడీ కూడా ఏపీ జోలికి వెళ్లకుండా ఉంటే బాగుండేదని అనుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని చెప్పారు. అలా చెప్పగానే అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా నవ్వేశారు.
వైసీపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్…
ఇదిలా ఉంటే ఈ సమావేశంలో చంద్రబాబు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మే 19న రాబోయే ఎగ్జిట్ పోల్స్ వైసీపీని అనుకూలంగా ఉంటాయని,, వాటిని చూసి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు గురికావద్దని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా టీడీపీయే అధికారంలోకి వస్తుందని స్పష్టంచేశారు.