

అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని మరోసారి తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిట్టే తిట్లకు చంద్రబాబునాయుడు అర్హుడేనని, ఆయనలా తిట్టడంలో తప్పేమీ లేదని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
చిన్న పిల్లాడైన నారా లోకేశ్, ఏదో పిచ్చి సలహా ఇచ్చి ప్రధాని నరేంద్ర మోడీని అవమానించాలని చెబితే, చంద్రబాబుకు ఉన్న 40 సంవత్సరాల అనుభవం ఏమైపోయిందని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ‘ఒక బీసీ ప్రధానికి నువ్వు ఇచ్చే గౌరవం ఇదా? నిన్ను “థు మీ బతుకు చెడ’ అని తెలంగాణ సీఎం తిట్టడంలో తప్పే లేదు.. ఆ తిట్టుకి నువ్వు అర్హుడివి” అని కామెంట్ పెట్టారు.
స్టిక్కర్ బాబు.. నిక్కరు కొడుకు…
‘స్టిక్కర్ బాబు, మోడీ గారిని చాయ్ కప్పుల పేరుతో అవమానించడం నీ ‘నిక్కర్’ కొడుకు నారా లోకేశ్ ఐడియానా? నీ లాగా 2 ఎకరాల నుండి మొదలై 2000 కోట్లు దోచేస్తే తప్పుకానీ, కష్టపడి పని చేసి మోదీ గారు ప్రధాని ఐతే తప్పేముంది? చంద్రబాబూ… నువ్వు తెలుగు వారి పరువు తీస్తున్నావు’ మరో ట్వీట్ లో కన్నా విమర్శలు గుప్పించారు.
‘అవినీతిని ప్రశ్నిస్తే ఎందుకలా ఉలిక్కి పడుతున్నావ్ “స్టికర్ సీఎం”..? బంధాలు, కుటుంబ వ్యవస్థ అంటే మీలాగా దోచిపెట్టాలా?? రాష్ట్రాన్ని SunRise స్టేట్ చేస్తా అని నమ్మించి నీ Son ని మాత్రమే Rise చేశావ్.. అవినీతి అచ్చు వేసి ఆంబోతు లాంటి కొడుకుని రాష్ట్రం మీద వదిలావు.’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మీద ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు కన్నా లక్ష్మీనారాయణ.
చదవండి: ప్రధాని మోడీ అడవి సింహం.. టీడీపీ నాయకులు గ్రామ సింహాలు!: ‘కన్నా’ సంచలన వ్యాఖ్యలు…
చదవండి: వెన్నుపోటులో చంద్రబాబే సీనియర్!: ఏపీ సీంను ఏకిపారేసిన మోడీ, ‘తండ్రీకొడుకులు దిగిపోవాల్సిందే’…








