
అనంతపురం: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి సంజీవ్ రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపిన ఆయన…. ప్రస్తుత రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని 40 ఏళ్ల రాజకీయ జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు చెప్పారు.
పాలిటిక్స్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. కానీ.. ఎన్నికల్లో ఓటమితో మాత్రం రాజకీయాల నుంచి
తప్పుకోవడం లేదని స్పష్టం చేశారు.
చదవండి: చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దివ్యవాణి…
జగన్ తో పర్సనల్ గా తనకు ఎలాంటి విబేధం లేదని…. రాజకీయ విమర్శలు మాత్రమే చేశానన్నారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆయన…. జగన్ కూడా తమవాడే అన్నారు.
ఏపీలో ఎన్నికల ఫలితాలు ఓ సునామి అన్నారు. మోడీతో జగన్ సాన్నిహిత్యం రాష్ట్రానికి శుభపరిణామంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సంఘంలో కొన్ని మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు.
అనంతపురం ఎస్పీ కార్యాలయానికి వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి….. తనకు ఇన్నాళ్లు సహకరిస్తూ వచ్చిన పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం తన రాజకీయ జీవితంపై ప్రకటన చేశారు.








