24.2 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home క్రికెట్ ఓహో…ప్రపంచకప్‌లో భారత్ తొలిమ్యాచ్ లేటుకి కారణం ఇదేనా..

ఓహో…ప్రపంచకప్‌లో భారత్ తొలిమ్యాచ్ లేటుకి కారణం ఇదేనా..

bcci-announces-team-india-for-world-cup-2019
- Advertisement -

లండన్: క్రికెట్ అభిమానులని అలరించే వన్డే వరల్డ్ కప్ గత నెల 30న మొదలైన  విషయం తెలిసిందే. అయితే 10 జట్లు పాల్గొంటున్న ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికీ 5మ్యాచ్‌లు ముగిశాయి. ఈరోజు ఇంగ్లండ్-పాకిస్టాన్ జట్ల మధ్య ఆరో మ్యాచ్ జరుగుతుంది.

ఇక ఇప్పటివరకు ఇండియా తప్ప అన్నీ జట్లు ఒక మ్యాచ్ ఆడేశాయి. సౌత్ ఆఫ్రికా రెండు మ్యాచ్‌లు ఆడింది. అలాగే ఈరోజు మ్యాచ్‌తో ఇంగ్లండ్,పాక్…రేపటి అఫ్గాన్-లంక మ్యాచ్‌తో ఆయా జట్లు కూడా రెండు మ్యాచ్‌లు ఆడినట్లు అవుతుంది.

కానీ భారత్ మాత్రం ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. తన తొలి మ్యాచ్ బుధవారం దక్షిణాఫ్రికాతో ఆడనుంది. అయితే భారత్ ఇప్పటివరకు మ్యాచ్ ఆడకపోవడానికి కారణం ఒకటి ఉంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో భారత ఆటగాళ్లు తీవ్రంగా అలసిపోయారు. దీంతో తొలి మ్యాచ్ కోసం సన్నద్ధమయ్యేందుకు మరికొంత సమయం కావాలని భావించిన బీసీసీఐ తన నిర్ణయాన్ని ఐసీసీ వరల్డ్ కప్ నిర్వాహకులకు తెలియజేసింది.

టీమిండియా కాస్త ఆలస్యంగా తొలి మ్యాచ్ ఆడేలా షెడ్యూల్ లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇక బీసీసీఐ విజ్ఞప్తిని ఐసీసీ మన్నించి.. భారత్ తొలి మ్యాచ్ ను జూన్ 5న ఆడేలా రీషెడ్యూల్ చేసింది.

చదవండి:  వరల్డ్ కప్: సఫారీలకి షాక్ ఇచ్చిన బంగ్లా…
- Advertisement -