ఆశా వర్కర్లకి శుభవార్త చెప్పిన సీఎం జగన్….

AP CM Jagan News, Asha Workers News, AP Latest News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి….గతేడాది తన పాదయాత్ర సందర్భంగా ప్రజలకి ఇచ్చిన ఒక్కో వాగ్దానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.  సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న జగన్…తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు.

ఈరోజు వైద్య, ఆరోగ్య శాఖలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన…ఆశా వర్కర్లకి శుభవార్త చెప్పారు. వారి జీతాన్ని రూ. 3 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్… ఆశా వర్కర్లకు ఇచ్చే జీతం అంశంపై కూడా అధికారులతో చర్చించారు.

అలాగే గ్రామీణ స్థాయిలో గర్భిణీలు, బాలింతల పట్ల జాగ్రత్తలు తీసుకునే ఆశా వర్కర్ల జీతాన్ని పెంచడంపై అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే జగన తన పాదయాత్ర సందర్భంగా ఆశా వర్కర్ల జీతాన్ని పెంచుతానని వారికి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నారు.

చదవండి: సంచలనం: జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన జేసీ…
- Advertisement -