26.2 C
Hyderabad
Wednesday, November 25, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ జగన్‌ని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్న వైసీపీ ఎమ్మెల్యేలు..

జగన్‌ని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్న వైసీపీ ఎమ్మెల్యేలు..

YS Jagan Updates, AP Election Updates News, AP political News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా చకచక అడుగులు వేస్తోంది. ఈరోజు తాడేపల్లిలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది.

గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఎన్నుకోనున్నారు. ఈ మేరకు తీర్మానం ప్రతిని ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో…. రాష్ట్ర గవర్నర్‌కు సమర్పిస్తారు. తన ఎమ్మెల్యేల బృందంతో వెళ్లి… జగన్‌ గవర్నర్‌కు ఈ ప్రతిని అందచేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలని గవర్నర్‌ను జగన్‌ కోరుతారు.

ప్రమాణస్వీకారానికి కేసీఆర్..

మరోవైపూ… ఈ నెల 30న ప్రమాణస్వీకారం చేయాలని నిర్ణయించడంతో ఆ ఏర్పాట్లపైనా జగన్ సమీక్షించారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉంది.

అలాగే కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సీఎస్ ను ఆదేశించారు. 30న ఉదయం 11 గంటల 40 నిమిషాల నుంచి 12 గంటల మధ్య జగన్‌ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.

ఇక ఈరోజు సాయంత్రం జగన్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు చేరుకుని కేసీఆర్, కేటీఆర్‌లను కలుస్తారు. 30న విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి కుటుంబ సమేతంగా రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందజేస్తారు.

చదవండి: ఏపీ ఎన్నికల్లో 50వేల మెజారిటీ దాటిన అభ్యర్ధులు వీరే…
- Advertisement -