టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమకు హైకోర్టు షాక్, ఆయన భార్య సహా 9 మందిపై…

tdp-mla-bonda-uma
- Advertisement -

tdp-mla-bonda-uma

అమరావతి: టీడీపీ నేత, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు ఉమ్మడి హైకోర్టు షాకిచ్చింది. ఉమా, ఆయన భార్య సహా 9 మందిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

తన స్థలానికి సంబంధించి నకిలీ, ఫోర్జరీ పత్రాలు తయారుచేయడంతో పాటు తనను బెదిరించారని రామిరెడ్డి కోటేశ్వరరావు  అనే వ్య క్తి విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కోటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ ను బుధవారం విచారించిన హైకోర్టు..  పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే బోండా ఉమ, ఆయన భార్య సహా ఆ 9 మందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

- Advertisement -