24.8 C
Hyderabad
Friday, October 16, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. మరో మూడు రోజులు కుమ్మేయనున్న వర్షాలు

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. మరో మూడు రోజులు కుమ్మేయనున్న వర్షాలు

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ప్రస్తుతం ఇది ఉత్తర కోస్తాంధ్ర తీరానికి దగ్గరలో ఆవరించి ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 72 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆది, సోమ వారాల్లోనూ అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాయలసీమ, కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని,  కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

- Advertisement -