29.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ షాక్: వైఎస్ జగన్ ఓటు తొలగించాలంటూ ఈసీకి దరఖాస్తు

షాక్: వైఎస్ జగన్ ఓటు తొలగించాలంటూ ఈసీకి దరఖాస్తు

jagan vote
- Advertisement -

కడప: జిల్లాలోని పులివెందుల బాక్రాపురంవీధిలోని 134వ పోలింగ్ కేంద్రంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటును తొలగించాలంటూ ఫారం-7 కింద గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినట్లు ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారి సత్యం వెల్లడించారు. దీనిపై విచారణ చేపట్టినట్లు తెలిపారు.

ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కృష్ణమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. తాము ఎలాంటి దరఖాస్తు చేయలేదని చెప్పారన్నారు. ఈ వ్యవహారాన్ని కలెక్టర్‌కు నివేదించినట్లు తెలిపారు. అధికారుల ఫిర్యాదు మేరకు సదరు గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

చంద్రబాబు సర్కారు కుట్రేనంటూ..

కాగా, ఇప్పటికే తమ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను తొలగిస్తున్న చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు ఏకంగా ప్రతిపక్ష నేత ఓటునే తొలగించేందుకు కుట్ర పన్నిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

వైఎస్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఓటు తొలగించాలంటూ ఫారం-7 దాఖలైన సంగతి తెలిసిందే. తమ ఓట్ల గల్లంతుకు సంబంధించి దరఖాస్తు చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని ఈ నేతలు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చదవండి: జగన్ పార్టీలోకి బడా పారిశ్రామికవేత్త: పీవీపీకి ఆ లోక్‌సభ సీటు ఖాయమే!
- Advertisement -