25.2 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ వైసీపీలో మరో ట్విస్ట్… అభ్యర్థుల తొలి జాబితా వాయిదా!

వైసీపీలో మరో ట్విస్ట్… అభ్యర్థుల తొలి జాబితా వాయిదా!

- Advertisement -

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ పడే అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేయబోవడం లేదు. ఈ ఉదయం పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి, తమ్మినేని సీతారాం, పిల్లి సుభాష్ చంద్రబోస్, విజయసాయిరెడ్డి తదితరులతో సమావేశమైన వైఎస్ జగన్, దాదాపు గంట సేపు జాబితాకు తుదిరూపు నిచ్చేందుకు చర్చలు జరిపారు.

ఆపై ఈ నెల 16వ తేదీన ఉదయం 10.26 నిమిషాలకు తమ పార్టీ తొలి జాబితా విడుదలవుతుందని వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది. జాబితాలో కొన్ని మార్పులు చేయాల్సి వున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.

పార్టీలో చేరికలతో బిజీగా ఉన్న వైఎస్‌ జగన్‌..

ఇదే సమయంలో ఇడుపులపాయలోని మహానేత వైఎస్ స్మారకం పార్టీకి సెంటిమెంట్ గా ఉందని, అక్కడే జాబితాను విడుదల చేయాలని పలువురు నేతలు కోరడంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించి ఆయన ఆశీస్సులతో వైఎస్‌ జగన్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని తెలుస్తోంది. జాబితా విడుదల తరువాత, వెంటనే జగన్ ప్రచార పర్వాన్ని ప్రారంభిస్తారని సమాచారం.

- Advertisement -