26.2 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటన: తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే…

విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటన: తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే…

cm kcr and minister ktr on visakhapatnam chemical gas leakage incident
- Advertisement -

హైదరాబాద్: విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకేజి దుర్ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ స్పందించారు. 

గ్యాస్ లీకేజి ఘటన దురదృష్టకరమని సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

విష వాయువును పీల్చి తీవ్ర అస్వస్థతకు లోనైన వారు చికిత్స పొంది త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు.

ఇక, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఈ వార్త తెలియగానే తాను షాక్‌ అయినట్లు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన తీవ్ర విచారం వెలిబుచ్చారు. 

ఈ దుర్ఘటనలో తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. 

చదవండి: విశాఖలో ఎల్జీ పాలిమర్స్ నుంచి కెమికల్ గ్యాస్ లీక్.. ముగ్గురి మృతి.. వందలాదిమందికి అస్వస్థత
చదవండి: విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 8కి పెరిగిన మృతుల సంఖ్య.. మరికాసేపట్లో విశాఖకు జగన్
చదవండి: విశాఖ గ్యాస్ లీక్ ఘటన: సీఎం జగన్ తీవ్ర ఆవేదన, సహాయక చర్యల వేగవంతానికి ఉన్నతాధికారులకు ఆదేశాలు…
చదవండి: విశాఖ గ్యాస్ లీకేజి: చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. విశాఖ వెళ్లేందుకు అనుమతి కోసం కేంద్రానికి విజ్ఞప్తి…
చదవండి: విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటన: స్పందించిన ప్రధాని మోడీ, సీఎం జగన్‌కు ఫోన్…
చదవండి: విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటన: జనసేనాని దిగ్భ్రాంతి, హృదయ విదారకం అంటూ…
- Advertisement -