22.6 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ సీఎంగా సచివాలయంలో అడుగుపెట్టిన జగన్…నవరత్నాలు ఫైల్‌పై తొలి సంతకం

సీఎంగా సచివాలయంలో అడుగుపెట్టిన జగన్…నవరత్నాలు ఫైల్‌పై తొలి సంతకం

AP CM Latest News, YS Jagan News, AP Secretariat News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ ఉదయం సచివాలయంలో మొదటిసారిగా అడుగుపెట్టారు. ఈ ఉదయం 8:39 గంటలకు సీఎం జగన్ సచివాలయంలోని తన చాంబర్‌లో అడుగుపెట్టారు. జగన్‌కు ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎం కార్యాలయం ఏర్పాటు చేశారు.

ఇక ఈ సందర్భంగా వేదపండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చిన నవరత్నాల పథకానికి సంబంధించిన ఫైల్‌పై జగన్ తొలి సంతకం చేశారు. ఆశావర్కర్ల జీతాల పెంపు ఫైలుపై, అనంత ఎక్స్‌ప్రెస్‌ హైవేకి కేంద్ర అనుమతి కోరుతూ కూడా సంతకం చేశారు. అలాగే జర్నలిస్టుల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ చేస్తూ సంతకం చేశారు.

అనంతరం ఈ ఉదయం 11:15 గంటలకు జరగనున్న ప్రొటెం స్పీకర్  శంబంగి చినఅప్పలనాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా జగన్ హాజరుకానున్నారు.

చదవండి: ఏపీలో 4లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!
- Advertisement -