24.2 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ మర్రికి మంత్రి పదవి దక్కేది అప్పుడేనా…!

మర్రికి మంత్రి పదవి దక్కేది అప్పుడేనా…!

YS Jagan Latest News, AP Cabinet Latest News, APCM Updates, Newsxpressonline
- Advertisement -

గుంటూరు: ఏపీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జగన్….తన మంత్రి మండలిని శుక్రవారం జరిగిన వైసీపీ శాసనసభా పక్ష సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే. జగన్ ఒకేసారి మంత్రివర్గంలోకి 25 మందిని తీసుకోగా… వారిలో ఐదుగురుకి ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు అప్పజెప్పనున్నారు.

ఇక జగన్ తన కేబినెట్‌లో బీసీలకు పెద్దపీట వేశారు. బీసీలలో ఏడుగురికి మంత్రి పదవులు అప్పగించగా… ఎస్సీల నుంచి ఐదుగురికి, రెడ్లు, కాపుల నుంచి నలుగురు, ముగ్గురు మహిళలకు మంత్రులుగా చాన్స్‌ ఇచ్చారు.

ఇక ఇప్పుడు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించినవారు రెండున్నరేళ్ల తర్వాత పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని, అప్పుడు 20 మందితో రాజీనామా చేయిస్తానని ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే ఆది నుంకి జగన్ కేబినెట్‌లో బెర్త్ ఖాయమని భావించిన వైసీపీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌కి జగన్ మంత్రివర్గంలో స్థానం లభించలేదు. తొలిదశలోనే మంత్రివర్గంలో ఆయనకు తప్పక స్థానం లభిస్తుందని అందరూ భావించారు.

అసెంబ్లీ ఎన్నికలలో చిలకలూరిపేట నుంచి వైసీపీ అభ్యర్థి రజినీని గెలిపిస్తే పార్టీ అధికారంలోకి వచ్చాక మర్రి రాజశేఖర్‌కు తప్పక మంత్రి పదవిని ఇస్తానని జగన్‌ ఇక్కడ జరిగిన బహిరంగ సభలో గతంలో ప్రకటించారు. అయితే అనూహ్యంగా మంత్రివర్గంలో ఆయన పేరు కనపడలేదు.

రెండున్నరేళ్ల తరువాత జరిగే మంత్రివర్గ విస్తరణలో తిరిగి మర్రి రాజశేఖర్‌ పేరు పరిశీలనకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి చూడాలి ఈ లోగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఏదైనా ఇస్తారేమో.

చదవండి: డిప్యూటీ సీఎంలు అయ్యేది వీరే?
- Advertisement -