32.2 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ వైసీపీకి కేసీఆర్ అధ్యక్షుడు, కేటీఆర్.. : మరోసారి ఆ 3 పార్టీలను ఏకేసిన చంద్రబాబు…

వైసీపీకి కేసీఆర్ అధ్యక్షుడు, కేటీఆర్.. : మరోసారి ఆ 3 పార్టీలను ఏకేసిన చంద్రబాబు…

Chandrababu-Naidu
- Advertisement -

అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్.. వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీలే లక్ష్యంగా సాగింది. ఆ మూడు పార్టీలపై మరోసారి చంద్రబాబు విమర్శల దాడి కొనసాగించారు.
రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు పన్నుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు.

వైసీపీకి కేసీఆర్ ప్రెసిడెంట్.. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్..

వైసీపీకి అధ్యక్షుడు కేసీఆర్‌ అని.. వైసీపీ, టీఆర్ఎస్‌కు సంయుక్త వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ ఉన్నారని చంద్రబాబు ఎద్దేవాచేశారు. జగన్‌ను టీఆర్ఎస్‌కు డమ్మీగా చేశారని విమర్శించారు. ఆంధ్రాపై నిలువెల్లా ద్వేషంతో కేసీఆర్‌ కుటుంబం ఉందని, దీనికి ఆ పార్టీ నేతల వ్యాఖ్యలే రుజువని అన్నారు. ముందు కేసీఆర్‌ పెట్టుబడి పెడతారు.. తరువాత జగన్ కప్పం కడతారంటూ విమర్శించారు.

నిస్సిగ్గుగా వైసీపీ దొంగ పనులు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. టీఆర్ఎస్‌కి డబ్బులు బాగా చేరాయని, అందుకే వైసీపీకి కేసీఆర్‌ ఎదురు పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. టీడీపీ అభ్యర్థులను బెదిరించే బీజేపీ నీచ కుట్రలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారని చంద్రబాబు అన్నారు.

టీడీపీ సమాచారం చోరీపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైందని, ఓట్ల తొలగింపు కుట్ర లోగుట్టును ఛేదిస్తామని స్పష్టంచేశారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు.. ప్రతి డ్వాక్రా మహిళ ఖాతాలో ఈ రోజే రూ.3,500 జమ చేసుకునే వీలు కల్పించామని తెలిపారు. బోగస్ చెక్కులని అన్న వైసీపీకి మహిళలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

చదవండి: సేవామిత్రలో తెలంగాణ సమాచారం ఎలా?: వదిలిపెట్టమంటూ సిట్ ఐజీ రవీంద్ర
- Advertisement -