26.7 C
Hyderabad
Thursday, October 15, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు! టీఆర్ఎస్ కౌంటర్ అటాక్!

సీఎం చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు! టీఆర్ఎస్ కౌంటర్ అటాక్!

CMChandrababu-Shocking-Decision
- Advertisement -

హైదరాబాద్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. అలాగే ప్రస్తుతం రెండు రాష్ట్రాలలో హాట్ టాపిక్ డేటా చోరీ వ్యవహారమే.

ఐటీ గ్రిడ్స్ కంపెనీ డేటా చోరీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య కాకరేపుతోంది. తాజాగా ఈ వివాదానికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కేసు నమోదయింది.

తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రవాదులతో పోల్చిన ఏపీ సీఎం..

ఐటీ గ్రిడ్స్ కంపెనీలో పోలీసుల సోదాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని చంద్రబాబు తీవ్రవాదులతో పోల్చారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేత దినేశ్ చౌదరి ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తన వ్యాఖ్యలతో చంద్రబాబు.. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని టీఆర్‌ఎస్‌ నాయకుడు దినేష్‌ చౌదరి ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా మాట్లాడిన చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

చదవండి: రసపట్టులో ఏపీ రాజకీయం! అప్రకటిత టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరేనా?
- Advertisement -