22.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ‘టీడీపీ అంటే తెలుగు డేటా దొంగల పార్టీ.. పిల్లకాకి నారా లోకేష్!’

‘టీడీపీ అంటే తెలుగు డేటా దొంగల పార్టీ.. పిల్లకాకి నారా లోకేష్!’

Botsa-Satyanarayana
- Advertisement -

హైదరాబాద్/అమరావతి: డేటా స్కాం విషయంలో దర్యాప్తు అంటే ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ ఎందుకు భయపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. నారా లోకేశ్‌ను పిల్లకాకిగా అంటూ విమర్శించారు. అసలు సూత్రధారుల బాగోతం బయటపడుతుందనే లోకేశ్ భయపడుతున్నారని ఆరోపించారు.

ఏ తప్పూ చేయకుంటే చంద్రబాబు, లోకేశ్ ధైర్యంగా విచారణను ఎదుర్కోవాలని సవాలు బొత్స విసిరారు. సోమవారం ట్విట్టర్ వేదికగా ఆయన ఈ మేరకు స్పందించారు.

‘డేటా దొంగతనం స్కాం పై విచారణ చేస్తే.. పిల్లకాకి @naralokeshకి అంత భయమెందుకో? అసలు సూత్రధారుల బాగోతం బయటపడుతుందనా? ఏ తప్పూ చేయనప్పుడు విచారణను ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా? దొంగతనం చేసి పచ్చిగా పట్టుబడింది కాక దొంగే “దొంగా.. దొంగా” అంటూ తండ్రీకొడుకులు భుజాలు తడుముకుంటున్నారు?’ అని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు.

టీడీపీ అంటే తెలుగు డేటా దొంగల పార్టీ

టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ అంటూ వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కోట్లాది మంది ఏపీ ప్రజల సమాచారం ఆధార్ నంబర్ సహా బయటకు వెళ్లిపోయిందని ఆరోపించారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయమని వ్యాఖ్యానించారు. బ్లూ ఫ్రాగ్, ఐటీ గ్రిడ్ కంపెనీల ఓనర్లు ఎప్పుడు చూసినా చంద్రబాబు వెంటే ఉంటారని దుయ్యబట్టారు.

హైదరాబాద్‌లోని వైసీపీ కార్యాలయంలో బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ గ్రిడ్ సమాచారం చోరీ, ఓట్ల తొలగింపుపై టీడీపీ నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాజకీయం చేయకుండా సామాన్యుల గురించి ఆలోచించాలని సూచించారు.

టీడీపీ అంటే ‘తెలుగు డేటా దొంగలపార్టీ’గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజాసాధికార సర్వే పేరిట ప్రజల సమాచారాన్ని చంద్రబాబు ప్రభుత్వం సేకరించిందన్నారు. అలాగే ఎన్నికల కమిషన్‌కు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఓటర్ల జాబితాను సేకరించారని బుగ్గన ఆరోపించారు.

చదవండి: ఏపీ పోలీసులకు ఇక్కడేం పని? అంత ఉలుకెందుకు?: బాబు, ఉత్తమ్‍లపై కేటీఆర్ ఫైర్

- Advertisement -