చంద్రబాబుకి బిగ్ షాక్! జగన్‌తో కాళ్ల బేరానికి వచ్చిన కాంగ్రెస్!?

7:24 am, Tue, 16 April 19
rahul ghandi cals to ys jagan

అమరావతి: 2019 ఎన్నికల్లో జగన్ పార్టీ అయిన వైసీపీ విజయం ఖాయమని ఇప్పుడు అందరికీ అర్ధమైపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పట్నించే జగన్ మద్దతు కోసం కేంద్రంలోని అన్ని పార్టీలు పాకులాడుతున్నాయి.

అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మ‌ర‌ణం త‌రువాత ఆయన కుమారుడు వైఎస్ జ‌గ‌న్‌ తమకు లొంగకపోవడంతో అతడిపై అక్ర‌మాస్తుల కేసులు మోపి.. జైలుకు పంపించింది కాంగ్రెస్‌ అనే భావన ప్రజల్లో ఉంది. రాష్ట్రాన్ని ఒక ప‌ద్ద‌తి లేకుండా విభ‌జించిన కాంగ్రెస్ 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అయ్యింది.

ఆలోచనలో పడిన కాంగ్రెస్ అధిష్ఠానం…

అయితే ఇప్పుడు ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ అనే వార్తలు వస్తుండడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచనలో పడింది.  ఒకప్పుడు వైఎస్ జ‌గ‌న్‌కు ద్రోహం చేసిన పార్టీ అధిష్ఠానం ఇప్పుడు మళ్లీ అదే జగ‌న్‌తో దోస్తీకి సిద్ద‌మ‌వుతోంది. 11న జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీదే అధికారం అని తేలిపోవ‌డంతో జ‌గ‌న్ మద్దతు కోసం కాంగ్రెస్ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది.

కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ రాక‌పోతే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డంలో అప్పుడు ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయి. ఏ పార్టీకి కూడా స్ప‌ష్ట‌మైన మెజారిటీ రాద‌ని స‌ర్వేలు చెప్ప‌డంతో కాంగ్రెస్ ఇప్ప‌ట్నించే జాగ్రత్తలు తీసుకుంటోంది. అనుకూల పార్టీల అధినేతల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు తనదైన శైలిలో పావులు క‌దుపుతోంది.

జగన్‌తో సయోధ్య కోసం రాహుల్ ప్రయత్నం?

ఇందులో భాగంగానే వైఎస్ జగన్‌తో సయోధ్య కోసం రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో జగన్‌తో రాయబారానికి గులాం నబీ ఆజాద్‌ను పంపినట్లు చెప్పుకుంటున్నారు. 

జ‌గ‌న్ మ‌ద్ద‌తు ఇస్తే అతడిపై తప్పుడు కేసులు పెట్టినట్లు అంగీకరిస్తామని, తాము అధికారంలోకి వస్తే ఆ కేసులను క్లోజ్ చేస్తామని, జగన్ కోరినట్లుగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

అధిష్ఠానం నుంచి వారికి ఆదేశాలు…

అలాగే ఏపీలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కూడా కాంగ్రెస్ నాయ‌కులు జ‌గ‌న్‌ను టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ విషయంలోనూ కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి వారికి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వైఎస్ జగన్ ఏపీకి కాబోయే సీఎం కాబట్టి ఎవరూ నోరు మెదప వద్దని, ఆయన గురించి కామెంట్లు చేయవద్దని కాంగ్రెస్ అధిష్ఠానం తమ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు పార్టీ వ‌ర్గాల‌ స‌మాచారం.